![]() |
![]() |
(1).webp)
అగ్నిపరీక్ష రెండో సీజన్ హోరాహోరీగా సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో అసలేం జరిగిందంటే.. ఆడియన్స్ కి కనిపించడం లేదు.. గేమ్ లో యాక్టివ్ గా లేరనే కారణంతో జ్యూరీలు హేమంత్, ప్రియాంక, చరణ్, భాగి నలుగురిని స్టేజ్ మీదకు పిలిచారు. వాళ్లకు శ్రీముఖి ఒక స్పెషల్ టాస్క్ ఇచ్చింది. మిగిలిన కంటెస్టెంట్ల కంటే మీరు ఎందుకు బెటర్ అనేది పాయింట్స్ తో ప్రూవ్ చేసుకోవాలి.. అందుకోసం ఒక స్టిక్ ని విరగ్గొట్టి ఎదుటి వ్యక్తి పేరు చెప్పి వాదించాలని టాస్క్ పెట్టింది.
మొదటగా చరణ్ వచ్చి దీపక్ పేరు చెప్పాడు. నేను హానెస్ట్ గా ఉంటా, ఆటల్లో ముందుంటా, వెయిట్ టాస్క్ లో దీపక్ కంటే ఎక్కువ సేపు నిలబడ్డా అని చరణ్ అనడంతో బాల్స్ నేను ఎక్కువసార్లు పట్టుకున్నా, టాస్కులు ఆడా అని దీపక్ కౌంటర్ ఇచ్చాడు. వెంటనే బిందు మాధవి కల్పించుకుని.. ఇలా మాట్లాడితే జనాలు నిన్ను చూస్తారని, నీకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నావా అని చరణ్ కి స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. తర్వాత భాగి వచ్చి రోహిత్ కంటే తను బెటర్ అని వాదించబోయింది కానీ రోహిత్ తన పాయింట్స్ తో గట్టిగా డిఫెండ్ చేసుకోవడంతో భాగి సైలెంట్ అయిపోయింది. ఇక హేమంత్ వచ్చి అపూర్వ పేరు చెప్పాడు. తప్పులు ఒప్పుకోదు, ఎల్లో కార్డ్ వచ్చినా తట్టుకోలేదు, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాదు, ఆమె కంటే నేను బాగా పర్ఫామ్ చేశా అని అన్నాడు. నువ్వే కన్ఫ్యూజ్ అవుతుంటావు, క్లారిటీతో ఉండవు, నేను బాగానే ఆడా అందరూ చూశారని అపూర్వ గట్టిగా బదులిచ్చింది.
చివరగా వచ్చిన ప్రియాంక టాస్క్ మొదలు పెట్టకుండా స్టోరీలు చెప్పడంతో జ్యూరీలకు కోపం వచ్చింది. మేటర్ కి రా, కథలు వద్దు పాయింట్లు చెప్పు, స్టిక్ విరగ్గొట్టు నీకు టాస్క్ అర్థం కాలేదా అని నవదీప్, బిందు తిట్టారు. అమన్ పేరు చెప్పి కూడా పాయింట్ చెప్పకుండా వాదించడంతో థాంక్యూ.. థాంక్యూ.. ఆపండి అని శ్రీముఖి అరిచినా వినలేదు. వీళ్ళని బయటకు పంపిస్తారా? నేను వెళ్లిపోవాలా? మీకు మంచి అవకాశం ఇస్తే టైం వేస్ట్ చేశారని శ్రీముఖి ఫైర్ అయింది. ఈ నలుగురు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయారని నవదీప్ కూడా కామెంట్ చేశాడు.
![]() |
![]() |